ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగనుండగా..మొత్తం 281 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. బద్వేల్ ఉపఎన్నిక పోరులో మొత్తం 15 మంది అభ్యర్థులు ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు 35.47 శాతం పోలింగ్ నమోదు అయింది.
బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 2,12,730 మంది ఓట్లరు ఉండగా, ఇందులో పురుషులు 1,06,650 ఉండగా, మహిళలు 1,06,069 మంది, ఇతరులు 20 ఉన్నారు. ఓటు వేసేందుకు ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరని అధికారులు సూచించారు.
దొంగ ఓటర్లను తరలిస్తున్నారంటూ కొన్ని ఛానల్‌లో అవాస్తవ కథనాలు ప్రచారం అవుతున్నాయి. కథనాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ స్పందించారు. దొంగ ఓటర్లను తరలిస్తున్నారన్నది అబద్ధమని తెలిపారు. ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులేమీ అందలేదన్నారు. ఎక్కడా పోలింగ్ ఆగలేదని విజయానంద్ స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్‌తోపాటు వెబ్‌క్యాస్టింగ్ చేస్తునట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ వెల్లడించారు.