ఏకగ్రీవం అవుతుందనుకున్న బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక… BJP పోటీకి దిగడంతో రసవత్తరంగా మారింది. వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది. అధికార పక్షం..ఆనవాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. ఈ పోటీకి టీడీపీ, జనసేన దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
బద్వేల్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. బద్వేల్‌లో కౌంటింగ్ కొనసాగుతోంది. బద్వేల్ ఫలితాలలో వైసీపీ దూకుడు. బద్వేల్‌లో తొలి రౌండ్‌లో వైసీపీకి 8,790 ఓట్ల ఆధిక్యత లభించింది. తొలి రౌండ్‌లో వైసీపీకి 10 వేల 478 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థికి 1,688 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 580 ఓట్లు వచ్చాయి. మూడు రౌండ్లు ముగిసే సరికి వైసీపీ అభ్యర్థి 23 వేల 700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.