తెలంగాణలో కురుస్తున్న భారీ వానలతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి, హైదరాబాద్ లో భారీగా వరద నీరు చేరింది.. వారం నుంచి కురుస్తున్న వర్షాలకు పల్లపు ప్రాంతాలు కాలనీలు కాలువలు తలపిస్తున్నాయి, ఈ సమయంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోలు తమ వంతు సాయం ప్రకటించారు, మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటిరూపాయలు, ఇటు ఎన్టీఆర్ 50 లక్షలు, నాగార్జున 50 లక్షలు ప్రకటించారు, తాజాగా ప్రభాస్ కూడా తన విరాళం ప్రకటించారు..తెలంగాణలో వరద నష్టానికి సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నాడుప్రభాస్.
ఇక ఆయన ప్రస్తుతం షూటింగ్ కోసం ఇటలీ వెళ్లారు అక్కడ నుంచి ఈ సాయం ప్రకటించారు..ఇంకా చాలా మంది రాజకీయ పారిశ్రామిక వేత్తలు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు రెండు నెలల జీతం విరాళం ఇచ్చారు.