నిన్న ఘటనపై బాలయ్య సీరియస్ సైగ చేస్తే మీ పని అంతే

నిన్న ఘటనపై బాలయ్య సీరియస్ సైగ చేస్తే మీ పని అంతే

0
106

బాలయ్య బాబు హిందూపురంలో ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు.. అయితే ఆయన అధికారంలో ఉన్న సమయంలో హిందూపురం పట్టించుకోలేదని ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే హిందూపురాన్ని ఇంకేం పట్టించుకుంటారు అని విమర్శలు చేస్తున్నారు చాలా మంది.. అయితే మూడు రాజధానుల అంశంపై తెలుగుదేశం మాత్రం దీనిని వ్యతిరేకించింది..

ఈ సమయంలో టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ వైసీపీ అడ్డు తగులుతోంది.. చంద్రబాబు నాయుడు సీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయినా సీమ డవలప్ మెంట్ కోరుకోవడం లేదు అని విమర్శలు చేస్తున్నారు.. సొంత నియోజక వర్గం హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణకు నిన్న చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఆయన కాన్వాయ్ను అడ్డుకుని కొందరు బాలయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దీంతో అక్కడ నుంచి బాలయ్య వెంటనే వెళ్లిపోయారు, దీనిపై బాలకృష్ణ స్పందించారు. తాను నిన్న ఒక్క సైగ చేసి ఉంటే పరిస్థితి ఎక్కడికి దారి తీసేది? అని ఆయన ప్రశ్నించారు. కానీ, చట్టంపై తమకు గౌరవం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సీమలో హైకోర్టుకి మీరు అంగీకరిస్తున్నారా లేదా అనే ప్రశ్నకి ఇటు చంద్రబాబు తెలుగుదేశం నేతలు మాత్రం సమాధానం చెప్పడం లేదు. దీంతో సీమ ప్రజలు తీవ్ర ఆగ్రహాలతో ఉన్నారు.