బాలాపూర్ గణపతి లడ్డు ఈ ఏడాది మరో రికార్డు సృష్టించింది. ఏ టేట వేలంపాటలో పాల్గొని, ఎక్కువ మొత్తంలో పాట పాడి లడ్డూను దక్కించుకుంటారు భక్తులు. అదే విధంగా ఈ ఏడాది కూడా భారీ మొత్తంలో పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ ఏడాది బాలాపూర్ వినాయకు డి లడ్డు రికార్డు సృష్టించింది. ఈసారి లడ్డూ ధర రూపాయలు 17. 60 లక్షలకు అమ్ముడుపోయింది.
దీన్ని కోలను రామిరెడ్డి అనే భక్తుడు దక్కించుకున్నాడు. గత ఏడాది కంటే ఈ ఏడాది లక్ష రూపాయలు ఎక్కువ పలకడం విశేషం. 1994 నుంచి లడ్డు వేలం వేస్తూ ఉండగా దీన్ని దక్కించుకోవడానికి చాలా మంది భక్తులు పోటీ పడుతుంటారు.
అయితే మొదట్లో స్థానికులకు మాత్రమే అవకాశం ఇచ్చిన నిర్వాహకులు తరువాత ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా కొనేందుకు అవకాశం ఇస్తున్నారు. రూపాయలు వందల నుంచి మొదలైన వేలంపాట లక్ష రూపాయలకు పెరిగిపోయింది. ఇక ఈ సంగతి అటుంచితే ఈ లడ్డూను పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం అందుకనే ఈ లడ్డూ వేలం పాట ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంటారు ప్రజలు.