తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నాటినుంచి అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం పార్టీకి కంచుకోటగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు కూడా తెచ్చుకుంది… ఆ పేరు ఇప్పటికి అలాగే ఉంది… సెగ్మెంట్ ప్రజలు మాజీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై ఎనలేని అభిమానం…. అప్పట్లో హిందూపురం సెగ్మెంట్ అభివృద్ది కోసం ఆయన చేసిన కృషివలన ప్రజల మనసుల్లో చెరగని ముద్ర పడిందని అనడంతో ఎలాంటి అతిశయోక్తిలేదు…
సెగ్మెంట్ లోని చిలమత్తూరు మండలం ప్రతిసారి ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలిపొందిన దానికి కీలకంగా మారిందని అధిష్టానం కూడా గుర్తించింది… అయితే పార్టీకి ప్రత్యేక ఆధరణ ఉన్నచిలమత్తూరు మండలంలో పార్టీ భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.. దీనికి ముఖ్య కారణం మండల గ్రూపు రాజకీయాలతో పార్టీ ఆదరణ కోల్పోవడంతో పాటు ప్రతిష్ట కూడా దిగజారింది…
కొందరు మండల సీనియర్ నాయకులు కాగా మరికొందరు వారి సొంత లాభాలకోసం అధికార వైసీపీ నాయకులతో స్నేహ పూర్వక సంబంధాలు పెట్టుకున్నారు… అలాగే పార్టీలో నెలకొన్న విభేదాలు పరిస్కరించకపోవడంతో పార్టీకి తీరని లోటు అని అంటున్నారు… ఇది ఇలాగే కొనసాగితే 2024 ఎన్నికల్లో కంచుకోట బద్దలు అవ్వడం ఖాయం అని అంటున్నారు…