భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని నూతన అసెంబ్లీ, సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయిస్తే, కాంగ్రెస్ నేతలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతల బుర్రలకు బూజు పట్టిందని, వీధి డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. నూతన సచివాలయాన్ని అన్ని హంగులతో నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టును ప్రపంచ వ్యాప్తంగా పొగుడుతుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నేతల బుర్రలకు బూజు పట్టింది: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్
కాంగ్రెస్ నేతల బుర్రలకు బూజు పట్టింది: టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్