జంక్ ఫుడ్ చాలా మంది ఇష్టంగా తింటారు, ఆరోగ్యానికి చేటు అని వైద్యులు చెబుతూ ఉన్నా చాలా మంది వీటిని మాత్రమే తింటారు, దీని వల్ల ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి అని చెప్పినా కొందరిలో మార్పు లేదు, బర్గర్లు పీజ్జాలు, డ్రింకులు ఇలా చాలా వరకూ మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. ఎందరు చెబుతున్నా ప్రజలు మాత్రం జంక్ ఫుడ్ను వదులుకోలేకపోతుంటారు.
ఇక కంపెనీలు కూడా అనేక యాడ్లు ఇస్తున్నాయి ఆఫర్లు ఇస్తున్నాయి, వీటి వల్ల తినడం కూడా పెరుగుతోంది,
ఇలాంటి వేళ తమ దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నుంచి ఇలాంటి ఫుడ్ తినాలి అనే ప్రకటన చేయడానికి లేదు.
ఇక కంపెనీలు వ్యాపార సంస్ధలు ఇలా జంక్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసేలా యాడ్స్ ఇవ్వకూడదు… కొవ్వు, చక్కెర, ఉప్పు, సాఫ్ట్ డ్రింక్స్ వంటి ఆహార పదార్థాలకు ఒకటి కొనడం మరొకటి ఉచితం ఇలాంటి యాడ్స్ చేయకూడదు,ఒబెసిటీని పూర్తిగా నిర్మూలించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు, దేశంలో చాలా మంది ఈ బాధతో ఇబ్బంది పడుతున్నారు.