సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay fires at CM KCR, TRS leaders

0
91

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. అధికారం చేతిలో ఉంది కదా అనే కండకావరంతో టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాట తప్పింది నిజం కాదా అని నిలదీశారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కించపరుస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేస్తే గులాబీ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా దాన్ని ఖండించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లోని దళిత నాయకులు కేసీఆర్ కు మద్దతు తెలపడం సిగ్గు చేటు అన్నారు. మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని..ముఖ్యమంత్రి కేసీఆర్ ని మార్చాలని చెప్పారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించే వరకు ఆయన్ని వదిలిపెట్టేది లేదన్నారు. కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులను తెలంగాణ సమాజమంతా ఛీ కొడుతుందని చెప్పారు.