పోడు భూముల పరిష్కారంకై బండి సంజయ్ మౌన దీక్ష

0
91

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని రేపు కరీంనగర్ లో మౌన దీక్ష చేయనున్నారు. జిల్లా కేంద్రంలోని వరలక్ష్మి గార్డెన్స్ లో రేపు ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు ఈ మౌనదీక్షలో బండి సంజయ్ పాల్గొననున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తమ తమ ప్రాంతాల్లో మౌన దీక్షకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు.