తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్ర యాదాద్రి భువనగిరి నుండి ప్రారంభం కాగా దీనిని జేబు దొంగలు అదనుగా భావించారు. దీనితో యాదగిరిగుట్టపైన ఓ బీజేపీ కార్యకర్త జేబు నుండి రూ.10 వేలు జేబు దొంగలు దొంగిలించారు.
తన జేబులోంచి డబ్బులు దొంగిలిస్తుండగా ఓ రిపోర్టర్ అలెర్ట్ అయి ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చారు. జేబుదొంగ రాంబాబును యాదగిరిగుట్ట పోలీస్ లు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.