Bandla Ganesh | పాలిటిక్స్‌లోకి బండ్ల గణేష్ రీఎంట్రీ.. అధికారిక ప్రకటన

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్(Bandla Ganesh) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే, తాజాగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బండ్ల గణేష్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కాంగ్రెస్‌లోకి మళ్లీ వస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ‘జై కాంగ్రెస్’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. CLP నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ మధ్యే మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge), డీకే శివ కుమార్(DK Shivakumar), రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని కలిసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేష్‌.. కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారు. అయితే.. కాంగ్రెస్ ఓటమి మనస్థాపంతో తరువాత సైలెంట్ అయిన బండ్ల గణేష్(Bandla Ganesh).. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు.

- Advertisement -
Read Also:
1. మరో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 12 బోగీలు
2. గచ్చిబౌలి పీఎస్‌లో MLC పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...