పవన్ భక్తుడికి 14 రోజులు రిమాండ్ విధించిన కడప కోర్టు

పవన్ భక్తుడికి 14 రోజులు రిమాండ్ విధించిన కడప కోర్టు

0
70

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాత… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ కు కడప కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది… ఈ నెల నాలుగవ తేది వరకు ఆయన రిమాండ్ కొసాగనుంది…

కడప జిల్లాకు చెందిన మహేష్ అనే వ్యక్తి దగ్గర బండ్లగణేష్ 2011లో 13కోట్లు అప్పు తీసుకున్నారు… అతని డబ్బు తిరిగి ఇవ్వక పోవడంతో 2013లో మహేష్, గణేష్ పై చెక్ భౌన్ కేసు పెట్టారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు…

ఆయన పై ఎఫ్ ఐఆర్ బుక్ అయినా కూడా కోర్టుకు హాజరు కాకపోవడంతో పోలీసులు బండ్లగణేష్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకుని కడప జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు… ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు 14 రోజులు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది…