ఈ వైరస్ ఎఫెక్ట్ వరల్డ్ ఎకానమీ పై ఎంతో ప్రభావం చూపించింది, అయితే అందరూ కూడా షేర్లలో పెట్టుబడి పెట్టకుండా సేఫ్ ఇన్వెస్ట్ మెంట్ గా బంగారం భావిస్తున్నారు, అందుకే అందరూ దీనిపై పెట్టుబడి పెడుతున్నారు.. షేర్ల సూచీలు తగ్గుతున్నాయి, బంగారం రేట్లు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి.
ఇక గడిచిన వారంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి..ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరిగి రూ.45920కు చేరింది. ఇక 24 క్యారెట్స్ గోల్డ్ రూ. 48,990 గా ఉంది… కిలో వెండీ రూ. 840 తగ్గి రూ.47660కు చేరింది. దీంతో చాలా రోజుల తర్వాత బంగారం బ్రేకులు ఇచ్చింది అంటున్నారు వ్యాపారులు.
ఇక బంగారం ధర పది గ్రాములు 49 వేలకు చేరుకుది, త్వరలో 50 వేల మార్క్ దాటుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు, చాలా మంది ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపడంతో ఇది సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు, ఈ ఏడాది బంగారం 70 వేల మార్క్ దాటుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.