దేశంలో కరోనా కోరలు చాచుతోంది.. రోజుకి మూడు లక్షలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి, ఇక దేశంలో ఐటీ హబ్ గా ఉండే బెంగళూరులో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది.. ఈ సెకండ్ వేవ్ లో చూస్తే
భారత ఐటీ రంగానికి కేంద్ర స్థానంగా ఉన్న బెంగళూరు నగరంపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది.
గత 24 గంటల్లో కర్ణాటక లో 39,047 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
అందులో ఒక్క బెంగళూరు నగరంలోనే ఏకంగా 22,596 కేసులు నమోదు కావడం అక్కడి పరిస్థితిని
తెలియచేస్తోంది, ఇక నగరంలో చాలా మంది వర్క్ ఫ్రమ్ వల్ల తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు..
ఇక్కడ హస్పటల్స్ లో చాలా మంది వచ్చి చేరుతున్నారు.
ప్రస్తుతం కర్ణాటకలో మూడు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉంటే అందులో రెండు లక్షల కేసులు బెంగళూరులో ఉన్నాయి…కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రెండు వారాల లాక్ డౌన్ ప్రారంభమైంది అత్యవసరం అయితేనే బయటకు రావాలి అని లేకపోతే రావద్దు అని తెలియచేస్తున్నారు అధికారులు.