బ్యాంకు ఖాతాలో 5 వేలు జగన్ మరో కీలక నిర్ణయం

బ్యాంకు ఖాతాలో 5 వేలు జగన్ మరో కీలక నిర్ణయం

0
81

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.. అంతేకాదు పేదలకు మంచి పధకాలు అందిస్తున్నారు.. ఆరునెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు వైయస్ జగన్.
ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పెట్టి న అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ముందుకు సాగిస్తున్నారు వైయస్ జగన్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.

రాష్ట్రంలోని ప్రజలు ఎవరైతే ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్నారో, వారందరికీ కూడా విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు ఆర్థికంగా సహాయం చేయాలనీ సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.

గతంలో పాదయాత్ర చేసిన సమయంలో ఈ హమీ ఇచ్చారు వైయస్ జగన్.. తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హమీని నెరవేరుస్తున్నారు . ఏపీ సర్కారు ఉత్తర్వులు కూడా ఇచ్చింది.. డిసెంబర్ 1 నుంచి ఇది అమలు చేయనున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోగికి 48 గంటల తర్వాత ఈ డబ్బు అతని బ్యాంకు ఖాతాలో జమచేయనుంది సర్కారు.