బ్యాంకులు సంచ‌ల‌న నిర్ణ‌యం ? ప‌ని స‌మ‌యం ఇదే ? ఆ స‌ర్వీసులు ఉండ‌వు

బ్యాంకులు సంచ‌ల‌న నిర్ణ‌యం ? ప‌ని స‌మ‌యం ఇదే ? ఆ స‌ర్వీసులు ఉండ‌వు

0
80

కరోనా క‌ట్ట‌డికి ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటోంది, ప్ర‌భుత్వాలు కూడా అనేక క‌ఠిన నిర్ణ‌యాలు అమ‌లు చేస్తున్నాయి, ప్ర‌జ‌ల‌కు ఆంక్ష‌లు పెడుతున్నారు, రోడ్ల‌పై తిర‌గ‌నివ్వ‌డం లేదు, మొత్తానికి అన్నీ వ్యాపార సంస్ధ‌లు క్లోజ్ చేశారు.

కేవ‌లం నిత్య అవ‌స‌రాల కోసం రోడ్లపైకి రావాలి అది కూడా కుటుంబానికి ఒక్క‌రు మాత్ర‌మే బైక్ పై తిర‌గ‌కూడదు, కారుపై వెళ్ల‌కూడ‌దు, సెల్ప్ డ్రైవ్ కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని తెలిపారు. ఇక బ్యాంకులు కూడా ప‌ని స‌మ‌యం త‌గ్గించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు ఏపిలోని బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు మార్చి 24 మంగళవారం నుంచి 31 వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. ఇక కొత్త అకౌంట్లు తెర‌వ‌రు, కొత్త రుణాలు మంజూరు చేయ‌రు, క‌రోనా ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయ‌నున్నారు.