మీరు లోన్ కోసం దరఖాస్తు చేయాలనుకుంటే ముందు బ్యాంకులు వెళ్లి లోన్ అప్లై చేస్తారు.. ఈ సమయంలో మీకు బలమైన క్రెడిట్ స్కోరు ఉంటేనే మీకు లోన్ వస్తుంది.. లేకపోతే మీకు లోన్ రాదు. బ్యాంకులు మీకు లోన్ ఇవ్వము అని చెబుతాయి.. మీరు గతంలో తీసుకున్న లోన్స్ మీరు చెల్లించిన బాకీలు ఇవన్నీ కూడా లెక్క వేసి చెప్పడం జరుగుతుంది ఈ క్రెడిట్ స్కోర్.
క్రెడిట్ స్కోరు సాధారణంగా 300 మరియు 900 మధ్య ఉంటుంది… మీకుఅధిక స్కోరు ఉంటే మీకు లోన్ ఈజీగా వస్తుంది
స్కోరు గ్రాఫ్ ఇలా ఉంటుంది
300-500 పూర్ చాలా తక్కువ మీకు లోన్ ఇవ్వరు
500-650 యావరేజ్
650-750 గుడ్
750+ ఎక్సలెంట్ – మీకు రుణాన్ని ఈజీగా ఇస్తారు
750+ క్రెడిట్ స్కోర్ మీకు ఉంటే మీకు వెంటనే లోన్ సాన్షన్ చేస్తారు
ఇలా మీకు మంచి స్కోరు ఉంటే వడ్డీ తగ్గించమని అడగవచ్చు.
అలాగే మీరుఎక్కువ లోన్ కూడా అడగవచ్చు దీనికి కారణం మీరు బాగా గతంలో పేమెంట్లు చేశారు కాబట్టి..
సో బ్యాంకులు మీకు వారి పరిధి బట్టీ ఇవ్వడం జరుగుతుంది.
క్రెడిట్ కార్డులు
పర్సనల్ లోన్లు
కారు లోన్లు
బిజినెస్ లోన్లు
హోమ్ లోన్లు ఇచ్చే సమయంలో ఈ స్కోర్ తప్పకుండా చూస్తారు