ఫ్లాష్- కరోనా బారిన పడ్డ బరాక్‌ ఒబామా

0
42

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. “గత కొన్ని రోజుల నుంచి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. మిచెల్‌, నేను వ్యాక్సిన్‌ తీసుకున్నాం. పరీక్షల్లో మిచెల్‌కు నెగెటివ్‌గా తేలింది. కేసులు తగ్గినప్పటికీ ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకొని వారుంటే వెంటనే తీసుకోండి” అని ఒబామా ట్వీట్‌ చేశారు.