బంగారం ధర మార్కెట్లో పరుగులు పెడుతోంది, గడిచిన వారం రోజులుగా ధర భారీగా పెరుగుతోంది, నేడు కూడా పసిడి ధర పరుగులు పెట్టింది , ముఖ్యంగా అంతర్జాతీయ ట్రెండ్ చూస్తే అక్కడ ధర పెరుగుతోంది భారత్ లో కూడా ధర భారీగా పెరుగుతోంది, షేర్ల కంటే ఇప్పుడు బంగారంపై పెట్టుబడి బెటర్ అని చాలా మంది భావిస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.120 పైకి కదిలింది. రూ.44,840కు చేరింది, అలాగే బిస్కెట్ బంగారం 24 క్యారెట్లు ధర 10 గ్రాములు 120 పెరిగి
రూ.47,870కు చేరింది.
ఇక వెండి ధర కూడా మార్కెట్లో భారీగా పెరుగుతోంది, . కేజీ వెండి ధర భారీగా పెరిగింది. రూ.2100 మేర పైకి పెరిగింది. దీంతో వెండి ధర రూ.45,250కు చేరింది. ఇక వెండి డిమాండ్ పెరగడంతో ఇప్పుడు ధర పెరిగింది అని చెబుతున్నారు బులియన్ వ్యాపారులు