పసిడి ధర గత వారం నుంచి కాస్త పెరుగుదల కనిపించినా, మూడు రోజులు తగ్గింది, మళ్లీ రెండు రోజుల నుంచి పుత్తడి పరుగులు పెట్టింది, అయితే తాజాగా బంగారం ధర మార్కెట్లో పెరిగింది..59 వేల నుంచి 54 వేలకు చేరిన పుత్తడి మళ్లీ పరుగులు పెడుతోంది, అయితే వెండి ధర మాత్రం క్రమంగా తగ్గుతోంది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.260 పెరిగింది. దీంతో ధర రూ.55,760కు చేరింది.. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరుగుదలతో రూ.51,110కు చేరింది.
ఇక భారీగా బంగారం ధరలు పెరగడంతో ఇప్పుడు వ్యాపారులు కూడా కాస్త బిజినెస్ డల్ అయింది అంటున్నారు, తగ్గుదల ఉంటేనే బంగారం కొనడానికి కస్టమర్ల రాక ఉంటుంది అంటున్నారు, ఇక
పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.66,950కు చేరింది. వచ్చే రోజుల్లో బంగారం పెరుగుదల ఉంటుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.