బంగారం ధర మార్కెట్లో పెరుగుతోంది, గడిచిన రెండు రోజులుగా ధర ఇలాగే కొనసాగుతోంది, హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.130 పెరిగింది.
ఇక ధర రూ.51,370కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.140 పెరుగుదలతో రూ.47,090కు చేరింది.
ఇక వెండి ధర మాములుగా లేదు భారీగా పెరుగుతోంది…కేజీ వెండి ధర ఏకంగా రూ.2250 పెరిగింది. దీంతో ధర రూ.55,400కు చేరింది. ఇలా వెండి ధర భారీగా పెరగడంతో బులియన్ వ్యాపారులే షాక్ అయ్యారు.
ఇక భారీగా బంగారం ధర పెరగడంతో మళ్లీ తగ్గే అవకాశాలు ఇప్పుడు లేవు అంటున్నారు, వచ్చే రోజుల్లో బంగారం మరింత పెరుగుతుంది అని ఈ శ్రావణంలో అమ్మకాలు బాగా ఉంటాయి అని అంటున్నారు. ఈ నెలాఖరు వరకూ బంగారం ఇలా హెచ్చులోనే ఉంటుంది అంటున్నారు.