భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈరోజు రేట్లు ఇవే

0
75

గ‌త వారం నుంచి త‌గ్గిన బంగారం ధ‌ర భారీగా పెరుగుతోంది, గ‌డిచిన రెండు రోజులుగా బంగారం ధ‌ర పెరుగుతోంది, బంగారం ధర పెరగడం ఇది వరుసగా రెండో రోజు.. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు, అంతేకాదు వెండి ధ‌ర కూడా భారీగా పెరుగుతోంది.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర . 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.60 పైకి కదిలింది. దీంతో ధర రూ.45,570కు చేరింది.ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరుగుదలతో రూ.49,710కు చేరింది.

ఇక దాదాపు మ‌రో 300 పెరిగితే 50 వేల మార్క్ చేరుతుంది అంటున్నారు వ్యాపారులు, ఇటు
కేజీ వెండి ధర ఏకంగా రూ.500 పెరిగింది. దీంతో ధర రూ.48,050కు పరుగులు పెట్టింది. బంగారం రేటు పెరుగుతుంది కాని త‌గ్గ‌దు అంటున్నారు వ్యాపారులు.