భారీగా వేలల్లో పెరిగిన బిర్యానీ ఆర్డర్లు – ఎందుకో తెలిస్తే మతిపోతుంది

భారీగా వేలల్లో పెరిగిన బిర్యానీ ఆర్డర్లు - ఎందుకో తెలిస్తే మతిపోతుంది

0
122

ఈ లాక్ డౌన్ సమయంలో దాదాపు హోటల్ రెస్టారెంట్లు ఆరు నెలలుగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ స్ధితి వస్తోంది.. ఇలాంటి సమయంలో అమ్మకాలు జోరు అందుకున్నాయి, ఇక హైదరాబాద్ పేరు చెప్పగానే ముందు వినిపించే ది ఫుడ్ లో బిర్యాని, మరి ఇప్పుడు ఈ అమ్మకాలు జోరుమీద సాగుతున్నాయి, దీనికి ప్రధాన కారణం జీహెచ్ ఎంసీ ఎన్నికలు.

దీంతో ఇటు ప్రచారాలు చేసే కార్యకర్తలకు పార్టీ ప్రచారాల సమయంలో వెంట ఉండే నేతలకు ఉదయం రాత్రి రెండు పూటలా బిర్యానీలే ఇస్తున్నారు నేతలు.. దీంతో భారీగా ఆర్డర్లు వస్తున్నాయి రెస్టారెంట్లకి ..సుమారు 70 నుంచి 100 రూపాయలకు బిర్యానీ అందించే పాయింట్ల దగ్గర నాయకులు భారీ బల్క్ ఆర్డర్లు ఇస్తున్నారట, వేల బిర్యానీలు ఆర్డర్లు వస్తున్నాయి.

దీంతో గతంలోకంటే ఇప్పుడు 75 శాతం అమ్మకాలు పెరిగాయి అంటున్నారు హోటల్ వ్యాపారులు, ఇక మనం తయారు చేయించినా అంతే అవుతుంది అని దాదాపు అందరూ ఆర్డర్ ఇస్తున్నారట, దీంతో భారీగా సేల్ పెరుగుతోంది దాదాపు
కేవలం వారం రోజుల వ్యవధిలోనే 80% బిజినెస్ పెరిగిపోయింది.