కరోనా కట్డడి కోసం తెలంగాణలో భారీగా విరాళాలు అందిస్తున్నారు పారిశ్రామికవేత్తలు పలువురు సినిమా ప్రముఖులు.. తాజాగా శాంతాబయోటెక్స్ అధినేత, పద్మభూషణ్ కెఐ వరప్రసాద్‌రెడ్డి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు.ముఖ్యమంత్రి సహాయ నిధికి వ్యక్తిగత సాయంగా కోటి 116 రూపాయల చెక్కును అందించారు.
కె ఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అధినేత కామిడి నర్సింహారెడ్డి కోటి రూపాయల చెక్కును అందజేశారు.
లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ, ఈడీ చంద్రకాంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తమ ల్యాబ్ తరపున ఒక లక్ష హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్స్‌ను అందిస్తామని ప్రకటించారు. ఇలా పెద్దలు చాలా మంది తమ ఉన్నతమైన మనసు చాటుకుంటున్నారు.
మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సీఎంఆర్‌ఎఫ్‌కు 5 కోట్ల విరాళం ప్రకటించింది. ఎండి పివి కృష్ణారెడ్డి ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి అందించారు. …మీనాక్షి గ్రూప్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం అందివ్వడానికి ముందుకు వచ్చింది.
తెలంగాణ ప్రభుత్వ వైద్యులకు ఉపయోగపడే ఎన్95 మాస్క్‌లను జిపికె ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ యజమానులు ఫణికుమార్, కర్నాల శైలాజారెడ్డి అందచేశారు అంతేకాదు . రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ‘ క్రెడాయ్’ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళం అందించారు. ఇలా పెద్దలు చాలా మంది సాయం అందిస్తున్నారు, అంతేకాదు సినిమా పరిశ్రమ నుంచి కూడా కోట్ల రూపాయల విరాళాలు అందుతున్నాయి.