భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైం హై ఈరోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైం హై ఈరోజు రేట్లు ఇవే

0
86

బంగారం ధ‌ర ఈరోజు కూడా భారీగా పెరిగింది, ఎక్క‌డా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు, అయితే బంగారం ధ‌ర ఇలా పెర‌గ‌డంతో ఒక్క‌సారిగా కొనుగోలు చేయాలి అని భావించే వారు షాక్ అవుతున్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.720 పెరిగింది. దీంతో ధర రూ.53,220కు చేరింది.

అలాగే ఆర్న‌మెంట్ బంగారం 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.640 పెరుగుదలతో రూ.48,790కు చేరింది, అయితే గ‌డిచిన వారం రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన వెండి ధ‌ర మాత్రం కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది.

కేజీ వెండి ధర ఏకంగా రూ.950 త‌గ్గింది. దీంతో ధర రూ.61,050కు చేరింది. ఇక శ్రావ‌ణం సేల్ ఉండ‌టంతో ఇప్పుడు కాస్త మార్కెట్లో ధ‌ర పెరుగుతుంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు, బంగారం ధ‌ర ఇప్పుడు త‌గ్గే ఛాన్స్ లేదు అంటున్నారు.