గడిచిన వారం రోజులుగా పుత్తడి నేల చూపులు చూస్తోంది, భారీగా ధర తగ్గుతోంది, నేడు కూడా మార్కెట్లో తగ్గుముఖం పట్టింది పుత్తడి ధర, దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పాలి. మరి నేడు మార్కెట్లు ఎలా ఉన్నాయి బంగారం వెండి ధరలు ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.980 తగ్గింది. రూ.50,400కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.900 తగ్గుదలతో రూ.46,200కు చేరింది
బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో డౌన్ అయింది.. ఏకంగా రూ.2,200 దిగొచ్చింది. దీంతో వెండి ధర రూ.64,500కు చేరింది వచ్చే రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.