భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ధర భారీ డౌన్

భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి ధర భారీ డౌన్

0
131

బంగారం ధర ఈరోజు మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది.. నాలుగు రోజుల నుంచి డౌన్ ట్రేడ్ అవుతున్న బంగారం ధర ఈరోజు కూడా కాస్త తగ్గింది, అయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు మాత్రం పెరుగుతున్నాయి, ఇక వెండి ధర కూడా మన దేశీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టింది.

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పడిపోయింది. దీంతో ధర రూ.53,550కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.360 చేరింది. దీంతో ధర రూ.49,090కు దిగొచ్చింది.

పసిడి ధర దిగివస్తే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.67,800కు దిగొచ్చింది. ముఖ్యంగా షేర్ల ర్యాలీ కొనసాగుతోంది అందుకే బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి అంటున్నారు వ్యాపారులు, మరీ ముఖ్యంగా వెండి ధరలు కూడా మరికొన్ని రోజులు ఇలాగే ఉండనున్నాయి.