భారీగా పెరిగిన బంగారం ధర టుడే రేట్ ఎంత అంటే ?

భారీగా పెరిగిన బంగారం ధర టుడే రేట్ ఎంత అంటే ?

0
92

బంగారం ధర వారంలో రెండు రోజులు తగ్గుతుంటే మరో నాలుగు నుంచి ఐదు రోజులు పెరుగుతోంది, ఇప్పుడు బంగారం సేల్ లేకపోయినా ధర మాత్రం భారీగా పెరుగుతోంది, దీంతో బంగారం కొనాలి అని అనుకునే వారికి మాత్రం ఇది షాక్ అనే చెప్పాలి.
పసిడి ధర పరుగులు పెడుతోంది. బంగారం ధర ఈరోజు కూడా పైకి కదిలింది.

బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.470 పైకి పెరిగింది. దీంతో ధర రూ.44,940కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.470 పెరిగింది. దీంతో ఇప్పుడు ధర రూ.48,980కు చేరింది, అయితే 50 వేల మార్క్ చేరే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.

అయితే బంగారం ధర ఇలా ఉంటే వెండి కూడా మెరుస్తోంది భారీగా రేటు పెరుగుతోంది. కేజీ వెండి ధర రూ.900 పెరిగింది. దీంతో ధర రూ.48,300కు చేరింది. వ్యాపారులు షేర్లలో కంటే బంగారంలోనే పెట్టుబడి పెడితే రాబడి వస్తుంది అని భావించి బంగారం పై పెట్టుబడి పెడుతున్నారు అందుకే ధర భారీగా పెరుగుతోంది.