భారీగా పెరిగిన బంగారం ధర.. టుడే రేట్స్

భారీగా పెరిగిన బంగారం ధర.. టుడే రేట్స్

0
100

గడిచిన నాలుగు రోజులుగా బంగారం ధర తగ్గుతూనే వస్తోంది, కాని తాజాగా మాత్రం బంగారం ధర ఒక్కసారిగా పరుగులు పెట్టింది, దీంతో అందరూ షాక్ అయ్యారు, అయితే 50 వేల మార్క్ బంగారం పది గ్రాములు చేరుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర ఈరోజు పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.410కు పెరిగింది. దీంతో పసిడి ధర రూ.44,720గా ఉంది. ఇక బిస్కెట్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.700పెరిగి.. దీంతో ధర రూ.48,790కు చేరింది. ఇక తగ్గుతుంది అని భావిస్తే బంగారం ధర పెరుగుతూ వస్తోంది.

హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు పెరిగాయి. ఇక వెండీ కూడా అదే బాటలో నడిచింది. మార్కెట్లో కేజీ వెండి ధర రూ.48,550కు చేరింది. ఇంకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.