భారీగా పెరిగిన బంగారం ధర – ఆల్ టైం హై ఈరోజు రేటు

భారీగా పెరిగిన బంగారం ధర - ఆల్ టైం హై ఈరోజు రేటు

0
88

పుత్త‌డి ప‌రుగులు పెడుతోంది, గ‌డిచిన వారం రోజులుగా ధ‌ర భారీగా పెరుగుతోంది, నేడు కూడా ప‌సిడి ధ‌ర‌ ప‌రుగులు పెట్టింది , ముఖ్యంగా అంత‌ర్జాతీయ ట్రెండ్ చూస్తే అక్క‌డ ధ‌ర పెరుగుతోంది భార‌త్ లో కూడా ధ‌ర భారీగా పెరుగుతోంది, షేర్ల కంటే ఇప్పుడు బంగారంపై పెట్టుబ‌డి బెట‌ర్ అని చాలా మంది భావిస్తున్నారు. ఇక బంగారం ధ‌ర ఇలా పెరుగుతూ ఉంటే ఈ ఏడాది చివ‌రి నాటికి 70 వేల మార్క్ దాటుతుంది అంటున్నారు వ్యాపారులు.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,480కు చేరింది, అలాగే 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,550కు చేరింది. 50వేల మార్క్‌కు దగ్గర్లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. మ‌రో రెండు రోజులు ఇలా ట్రెండ్ ఉంటే 10 గ్రాములు 50 వేల‌కు చేరుతుంది.

ఇక మార్కెట్లో బంగారం ధ‌ర కూడా భారీగా పెరిగింది..కేజీ వెండి ధర భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.46,720కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరిగింది అందుకే ధ‌ర పెరిగింది అంటున్నారు. 46,110 దిల్లీలో కూడా ప‌ది గ్రాములు బంగారం ధ‌ర ఉంది.