భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు రేట్లు ఇలా ఉన్నాయి

భారీగా పెరిగిన బంగారం ధర ఈరోజు రేట్లు ఇలా ఉన్నాయి

0
100

పసిడి నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చింది, కాని తాజాగా భారీగా బంగారం ధర పెరిగింది, ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలి అని భావించిన వారికి ఇది షాక్ అనే చెప్పాలి..హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరిగింది ఇలా 44,750కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగింది. దీంతో ధర రూ.48,830 కు చేరింది.

ఇక బంగారంతో పాటు వెండి ధర కూడా మార్కెట్లో పెరిగింది,. దీంతో ధర రూ.48,480కు చేరింది. అంతర్జాతీయంగా మార్కెట్లో బలమైన ట్రెండ్స్ ఉన్నాయి, ఇక షేర్లపై పెట్టుబడి పెట్టేవారు బంగారం పై పెట్టుబడి పెడుతున్నారు, షేర్ల విలువ దారుణంగా పతనం అవ్వడంతో..

బంగారానికి ధర వచ్చేలా చేస్తోంది, ఇక మార్కెట్లో కూడా దారుణమైన రేట్ కనిపిస్తోంది. అయితే బంగారం 50 వేల మార్క్ తాకుతుంది అంటున్నారు బులియన్ వ్యాపారులు. వెండి ధర కూడా ఇదే దారిలో నడిస్తే కిలో 70 వేలకు చేరచ్చు అంటున్నారు.