భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైమ్ రికార్డ్ ఈరోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైమ్ రికార్డ్ ఈరోజు రేట్లు ఇవే

0
85

బంగారం ధ‌ర ఎక్క‌డా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు, మార్కెట్లో ఆల్ టైం రికార్డ్ స్ధాయికి చేరుకుంటోంది. ప‌సిడి త‌గ్గే సూచ‌న‌లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు, అయితే ఇలా భారీగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌తో సామాన్యులు బంగారం కొనాలి అంటే భ‌య‌ప‌డే స్దితి వ‌చ్చేసింది.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగింది. దీంతో ధర రూ.56,810కు చేరింది. ఇక ఆభ‌ర‌ణాల‌కు వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.52,080కు చేరింది

ఇది ఆల్ టైం రికార్డ్ స్ధాయి అని చెప్పాలి, ఇక వెండి ధ‌ర కూడా ఇలా భారీగా పెరుగుతోంది, కాని నేడు మాత్రం కాస్త మార్కెట్లో వెండి ధ‌ర త‌గ్గింది.కేజీ వెండి ధర రూ.350 దిగొచ్చింది. దీంతో ధర రూ.65,050కు చేరింది, మార్కెట్లో బంగారం వెండి ఇప్పుడు త‌గ్గే సూచ‌న‌లు లేవు అంటున్నారు వ్యాపారులు.