భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైం హై రికార్డ్ ఈ రోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైం హై రికార్డ్ ఈ రోజు రేట్లు ఇవే

0
90

బంగారం ధ‌ర ప‌రుగులు పెడుతోంది, ఎక్క‌డా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు, బంగారం ధ‌ర మార్కెట్లో రాకెట్ గా దూసుకుపోతోంది, అయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.820 పైకి కదిలింది. దీంతో ధర రూ.54,300కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న రేట్ల‌లో ఇది హై రేట్ అనే చెప్పాలి.

22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.730 పెరుగుదలతో రూ.49,780కు చేరింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా ఆరో రోజు ,ఇక ప‌సిడితో పాటు వెండి ధ‌ర కూడా చుక్క‌లు చూపిస్తోంది.

కేజీ వెండి ధర ఏకంగా రూ.3490 పైకి కదిలింది. దీంతో ధర రూ.64,700కు చేరింది. అయితే ఈ లాక్ డౌన్ వేళ అమ్మ‌కాలు కొనుగోళ్లు లేవు, కాని అంత‌ర్జాతీయ ఒడిదుడుకుల మ‌ధ్య బంగారం ధ‌ర ఇంత పెద్ద ఎత్తున పెరుగుతుంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు.