భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైం హై ఈరోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఆల్ టైం హై ఈరోజు రేట్లు ఇవే

0
133

బంగారం ధ‌ర‌లు భారీగా పెరుగుతున్నాయి, ఎక్క‌డా త‌గ్గుముఖం ప‌ట్ట‌డం లేదు, ఆల్ టైం హైకి గ‌త వారం రోజులుగా చేరుతోంది, ఈ క‌రోనా స‌మ‌యంలో డిమాండ్ లేక‌పోయినా బంగారం ధ‌ర భారీగా పెరుగుతోంది.
24 క్యారెట్ల బంగారం ధర రూ.55350గా ఉంది డిల్లీలో. ముంబైలో అయితే.. రూ. 54800గా ఉంది.

ఇక మ‌న హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 58320 గా ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ. 53,510. ఏపీలో కూడా ఇలాగే ఉన్నాయి బంగారం ధ‌ర‌లు బంగారం ఇలా ఉంటే వెండి ధ‌ర కూడా అంతే భారీగా పెరుగుతోంది.

ఇక నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 500 రూపాయలు పెరిగింది. దీంతో 53,510 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారంకూడా పది గ్రాములకు 500 రూపాయలు పెరిగింది. దీంతో 58 వేల రూపాయల రికార్డ్ మార్కును దాటి 58,320 రూపాయల ద‌గ్గ‌ర ట్రేడ్ అవుతోంది.73వేల రూపాయల గరిష్ట రికార్డు ధర ద‌గ్గ‌ర వెండి అమ్మ‌కాలు జ‌రుపుతోంది, ఈరోజు రెండువేలు పెరిగింది వెండి.