రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి ఈ రోజు మళ్లీ ర్యాలీ చేసింది, బంగారం ధర ఒక్కసారిగా పరుగులు పెట్టింది, ఈరోజు ర్యాలీ చేసింది మార్కెట్లో, నిన్న మొన్న రెండు రోజులు నాలుగు వేలు తగ్గిన పుత్తడి నేడు మళ్లీ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.820 పెరిగింది…దీంతో ధర రూ.55,500కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది.. 10 గ్రాముల బంగారం ధర రూ.920 పెరుగుదలతో రూ.51,050కు చేరింది.
ఇక వెండి దాదాపు 10 వేలు మొన్నటి వరకూ తగ్గి 65000 ఉంటే.. నేడు మళ్లీ రెండు వేలు పెరిగింది, కిలో 67000 ట్రేడ్ అవుతోంది, బంగారం వెండి ధరలు మళ్లీ ఈరోజు జంప్ చేశాయి, అయితే 50 వేల మార్క్ కంటే తగ్గడం కష్టం అంటున్నారు బులియన్ వ్యాపారులు.