భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు రేట్లు ఇవే

0
99

పుత్తడి ధరలు ఈ నెలలో దాదాపు ఎనిమిది రోజులు పెరుగుదల నమోదు చేశాయి….నేడు కూడా బంగారం ధర పెరిగింది.. మరి బులియన్ మార్కెట్లో చూసుకుంటే వెండి బంగారం ధర పెరుగుతోంది, పుత్తడి ధరలు పెరగడంతో పాటు వెండి రేటు కూడా పెరుగుతోంది, మరి నేడు అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి అనేది బులియన్ మార్కెట్లో రేట్లు చూద్దాం.

 

హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరుగుదలతో రూ.47,780కు ట్రేడ్ అవుతోంది…అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పెరుగుదలతో రూ.43,800కు ట్రేడ్ అవుతోంది, పుత్తడి వెండి ధరలు మార్కెట్లో గత పది రోజులుగా ఇలా పెరుగుదల నమోదు చేస్తున్నాయి.

 

బంగారం ధర పెరిగితే.. వెండి రేటు మాత్రం స్థిరంగా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు…కేజీ వెండి ధర రూ.71,900

దగ్గర ట్రేడ్ అవుతోంది.. ఇక బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది అని వెండి ధర కూడా పెరిగే అవకాశాలున్నాయి అని బులియన్ వ్యాపారులు అంటున్నారు.