ఏ ఒక్కరి మొబైల్ ఫోన్ తీసుకున్నా సరే అందులో ఖచ్చితంగా టిక్ టాక్ యాప్ ఉంటుంది.. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ యాప్ ను వాడుతున్నారు…అయితే తాజాగా టిక్ టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ ఇమింగ్ సంపద 10 కోట్లు డాలర్ లు దాటినట్లు ఒక నివేదిక వెళ్లడించింది..
ప్రపంచ వ్యాప్త స్టార్ట్ ప్ లో తనదైన ముద్ర వేసుకుని టిక్ టాక్ తన విజయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది… షేర్ మార్కెట్ లో కూడా టిక్ టాక్ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది… టిక్ టాక్ ప్రారంభంలో అమెరికన్ టీనేజర్లను విశేషంగా అలరించింది…
ప్రస్తుతం టిక్ టాక్ ట్విట్టర్ తో సమానంగా పోటీ పడుతోంది.. టిక్ టాక్ లో మ్యూజిక్ వీడియో హావభావాలు ప్రదర్శించేందుకు యువత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు… టిక్ టాక్ అక్ష్యంగా చైనీస్ ఇంటర్నెట్ దిగ్గజం అలీబాబాను ఢీ కొట్టడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది..