భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర రేట్లు ఇవే

భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర రేట్లు ఇవే

0
94

భారీగా పెరుగుద‌ల క‌నిపించిన బంగారం ధ‌ర ఒక్క‌సారిగా త‌గ్గుతూ వ‌స్తోంది, ఈసారి బంగారం ధ‌ర మార్కెట్లో త‌గ్గుముఖం ప‌ట్టింది. దిల్లీ ముంబైలో సేల్స్ కాస్త ఊపు అందుకున్నాయి. మ‌రి మార్కెట్లో బంగారం ధ‌ర ఎలా ఉంది అనేది చూద్దాం.

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.350 దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,530కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,070కు చేరింది.

పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. గత రెండు రోజుల్లో కేజీ వెండి ధర రూ.660 పడిపోయింది. వెండి ధర కిలో రూ.68,300కు చేరింది…విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇలానే ఉన్నాయి..ఇక వ‌చ్చే రోజుల్లో కూడా బంగారం ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది అంటున్నారు బులియ‌న్ వ్యాపారులు. మ‌ళ్లీ షేర్లు మార్కెట్ పుంజుకోవ‌డంతో బంగారం పై పెట్టుబ‌డి కాస్త త‌గ్గింది.