బంగారం ధర భారీగా తగ్గింది, ఈ వారం గోల్డ్ రేట్ చాలా వరకూ తగ్గింది అనే చెప్పాలి. దాదాపు మూడు వేల వరకూ తగ్గింది, ఇక పసిడి బాటలో వెండి ధర కూడా నడుస్తోంది, హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర వారంలో భారీగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2930 పడిపోయింది. 55,760కు దిగొచ్చింది.
22 క్యారెట్ల బంగారం ధర కూడా పడిపోయింది. 10 గ్రాములకు రూ.2,690 దిగొచ్చింది. రూ.51,110కు పడిపోయింది. ఇక బంగార ఇలా తగ్గితే ఏకంగా 25 వేల వరకూ పెరిగిన వెండి ధఱ కూడా సగానికి సగం తగ్గింది.వెండి ధర కేజీకి ఏకంగా రూ.7250 తగ్గింది.
ఇప్పుడు మార్కెట్లో రూ.66,950కు దిగొచ్చింది. ఇక మన దేశంలో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు వ్యాపారులు, ముఖ్యంగా అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గుదల కనిపిస్తున్నాయి,