భారీ వర్షాలకు చెరువులు తలపిస్తున్న వీధులు

భారీ వర్షాలకు చెరువులు తలపిస్తున్న వీధులు

0
92

బంగాళకాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ దాటికి తమిళనాడు అతలాకుతలం అవుతోంది… భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి… తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది…

రాజధాని చెన్నై సహా అనేక జిల్లాల్లో రాత్రి నుంచి ఏకదాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి చెన్నై వీధులు చెరువులుగా తలపిస్తున్నాయి… 400 కిలో మీటర్లకు పైగా దూరంలో ఉన్న సమయంలోనే ఈ స్థాయిలో నివార్ తుఫాన్ ప్రభాన్ని చూపిస్తోంది…

తీరానికి చేరువ అయ్యేకొద్ది దాని తీవ్రత మరింత ఉదృతమవుతుందని విలయాన్ని సృష్టించక తప్పదనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి… ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు…