భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈరోజు ఆల్ టైం హై

భారీగా పెరిగిన బంగారం ధ‌ర ఈరోజు ఆల్ టైం హై

0
87

రోజు రోజుకి బంగారం ధ‌ర ఆల్ టైం హైకి చేరుతోంది, భారీగా బంగారం ధ‌ర పెరుగుతోంది, గ‌డిచిన రెండు నెలులుగా బంగారం కొనుగోళ్లు లేక‌పోయినా అమ్మ‌కాలు లేక‌పోయినా భారీగా ధ‌ర పెరుగుతోంది, అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం పసిడి ధర పరుగుల పెట్టేలా చేస్తోంది. చాలా మంది షేర్ల కంటే ఇప్పుడు బంగారం పై పెట్టుబ‌డి పెట్టాలి అని చూస్తున్నారు.

ఇన్వెస్ట‌ర్లు ప్రపంచం అంతా ఇలాగే ఆలోచిస్తున్నారు.. బంగారంపైనే పెట్టుబ‌డి పెడుతున్నారు.
మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 390 పెరిగి రూ.₹45,470కు చేరింది.ఇక 24
క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 390 పెరిగి రూ. 48,930కు చేరింది. మార్కెట్లో కిలో వెండి రూ. 49వేల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

భారీగా ఇలా రేటు పెర‌గ‌డంతో ఇక 49000 చేరింది బంగారం ధ‌ర‌…, దేశంలో ఈ వారంలో 50 వేల‌కు ప‌ది గ్రాములు బంగారం ధ‌ర చేరే అవ‌కాశం ఉంది అంటున్నారు, ఇప్పుడు రేటు త‌గ్గే అవ‌కాశం లేదు అంటున్నారు వ్యాపారులు.