పట్టు వీడని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు..మరో కీలక నిర్ణయం

0
66

తెలంగాణ: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టు విడవడం లేదు. తమ సమస్యలను పరిష్కరించాల్సిందే అంటూ విద్యార్థులు ఎండ, వానని సైతం లెక్కచేయకుండా ఆందోళన చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ లేదా మంత్రి కేటీఆర్‌ సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని, తమకు స్పష్టమైన హామీ లభించే వరకు తగ్గేదే లేదంటున్నారు.

తాజాగా విద్యార్థులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. తమ 12 డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.