విశ్వవేదికపై బతుకమ్మ ఖ్యాతి..నేడే బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన

Batukamma fame on the world stage..Batukamma exhibition on Burj Khalifa today

0
88

తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నేడు ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై, బతుకమ్మను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది కావడం మరో విశేషం. ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మను వీక్షించనున్నారు.

బతుకమ్మ పండుగ ద్వారా మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రేపు సాయంత్రం దుబాయ్ లో జరగబోయే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. 2004 జనవరి 6న బుర్జ్ ఖలీఫా నిర్మాణం మొదలవగా, 2020 జనవరి 4న ఈ భవనాన్ని ప్రారంభించారు. 829.8 మీటర్ల ఎత్తు గల ఈ భవనంలో మొత్తం 163 అంతస్తులున్నాయి. అత్యంత వేగంతో వెళ్లే 57 అధునాతన సాంకేతికతతో కూడిన లిప్టులను అమర్చారు.

నేడు సాయంత్రం భారత కాలమానం ప్రకారం 9.40 PMకు, 10.40 PMకు రెండు సార్లు బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ వీడియో ప్రదర్శించబడుతుంది.