బాబ్రీ మసీదు కూల్చివేత కేసును లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు రేపు తీర్పును ఇవ్వనుంది… ఈకేసులో నిందితులుగా ఉన్న 32 మందిని కోర్టు ముందు హాజరుపరచాలని కోరింది… ప్రస్తుతం ఈ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది… సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది…
- Advertisement -
రేపు వెలువడే తీర్పు శాంతి భద్రతలపై ప్రభావం చూపవచ్చని అందుకే అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.. అయోధ్య తీరుపై అసంతృప్తితో ఉన్న కొందరు బాబ్రీ మసీదు తీర్పుకోసం ఎదరు చూస్తున్నారని ఇందులో దోషులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పకపోతే అల్లర్లు సృష్టించేందుకు సిద్దంగా ఉన్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి…