బీ అలెర్ట్… ఇండియా

బీ అలెర్ట్... ఇండియా

0
91

భారతదేశంలో కరోనా వైరస్ సాంకేతికంగా రెండో దశలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో మూడో దశ మీద దృష్టికేంద్రీకరిస్తుంది…ఒక వైపు రెండోదశ తాలూకా జాగ్రత్త చర్యలు తీసుకుంటే మూడోదశలో తీసుకోవాల్సి చర్యలకు ముందస్తు ప్రణాళికను సిద్దం చేస్తుంది..

సామూహిక వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రైవేటు ఆసుపత్రిల్ని లేబోరేటరీలను కూడా భాగస్వాముల్ని చేస్తుంది…. ముఖ్యంగా మహారాష్ట్ర వంటి చోట్ల ఇలాంటి చర్యలు సత్వరం అనివార్యం అవుతున్నట్లు కేంద్రం గుర్తించింది… ఐసోలేషన్ వార్డును పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఆలోచనతో ఎన్నెన్ని ఇండిపెండెంట్ రూములకు బెడ్లు అవసరమవుతాయన్న అంచనాల తయారీలో కేంద్ర ఆరోగ్య మంత్రి శాఖ ఉన్నట్లు తెలుస్తోంది…

హెల్త్ కేర్ వర్కర్లకు పెద్ద ఎత్తున శిక్షణకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి… ఒకవేళ కరోనా వ్యాప్తి దేశం గనుక మూడో దశలో ప్రేశిస్తే హెల్త్ ప్యాకేజీలను ఇతర ప్రోటోకాల్స్ ను సిద్దం చేయాలి అయుష్మాన్ భారత్ ఆరోగ్యభీమా పథకానికి నోడల్ ఏజెన్సీ వ్యవహరిస్తున్న నేషనల్ హెల్త్ అథారిటీని అదేశించింది….