దేశంలో ఆధార్ కార్డు పాన్ లింక్ చేసుకోవాలి అని కేంద్రం ఇప్పటికే తెలిపింది.. మీకు బ్యాంకు ఖాతా ఉంటే మీరు ఆధార్ కార్డుతో పాటు పాన్ నెంబర్ కూడా ఇవ్వాల్సిందే, ఇలా ఇస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంతేకాదు ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు అయినా ఈజీగా చేయవచ్చు బ్యాంకులో, అయితే ఒకవేళ పాన్ లేదా ఆధార్ లింక్ చేయకపోతే అనేక ఇబ్బందులు తప్పవు.
మర్చిపోకండి పాన్ కార్డును ఆధార్తో అనుసంధానించడానికి చివరి తేదీ 31 మార్చి 2021 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి మీరు పాన్ ఆధార్ లింక్ పూర్తి చేశారా, చేయకపోతే ఈ లింక్ లోచూసి పూర్తి చేసుకోండి. ఇక మీరు ఇలా పూర్తి చేయకపోతే ఐటీ శాఖ 10 వేల ఫైన్ విధించవచ్చు.
ఇక్కడ ఆధార్ పాన్ లింక్ పూర్తి చేసుకోండి
https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html
మీరు పాన్ ఆధార్ లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ ఇక పనిచేయకపోవచ్చు, ఇక మీకు పాన్ రద్దు అయితే మీరు మీ బ్యాంకు ఖాతాలో ఒకేసారి 50 వేలు దాటి నగదు డిపాజిట్ చేయడానికి కష్టం అవుతుంది, ఆ సమయంలో పాన్ నెంబర్ ఇవ్వాల్సిందే, భారీగా నగదు డిపాజిట్ చేయడానికి ఇబ్బందులు వస్తాయి.. ఆస్తిని కొనలేరు లేదా అమ్మలేరు, షేర్లు మరియు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టలేరు. సో అందుకే పాన్ ఆధార్ లింక్ చేసుకోవాలి.