Flash: కొట్టుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు..పోలీసుల లాఠీఛార్జ్

0
91

తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కోస్గిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా గాడిదతో కేక్ కట్ చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. దీనితో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ ఛార్జీ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు.