ప్రేమంటే ఇదే అంటున్నారు ఈ స్టోరీ చదివిన వారు, అయితే ప్రేమికుడికి ప్రమాదకరమైన ఎయిడ్స్ వ్యాధి ఉంది అని తెలిసినా ఆ ప్రియురాలు ఆ ప్రియుడ్నే పెళ్లి చేసుకుంది. అందుకే అందరూ ఇలా అంటున్నారు, తమిళనాడు, కన్యాకుమారి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆమెకి కూడా హెచ్ఐవీ సోకిందేమోనన్న అనుమానంతో ఆమెకి టెస్టులు చేస్తున్నారు.
నాగర్ కోయిల్ లో ప్రైవేటు కాలేజీలో డిగ్రీ తొలి సంవత్సరం చదువుతున్న ఓ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది.. పోలీసులకు కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చారు. ఇక పోలీసులు వెతికితే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది అని తేలింది,
ఆమె 22 ఏళ్ల ఆటో డ్రైవర్ తో ప్రేమలో ఉన్నట్టు విచారణలో గుర్తించారు. చివరకు ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
అయితే ఆటో డ్రైవర్ కు ఎయిడ్స్ కూడా ఉంది, అతనిని వదిలి వచ్చేయాలి అని చెప్పినా ఆమె వినిపించుకోలేదు నాకు ప్రియుడే కావాలి అని కోరుకుంది, ఆమెకు ఇంకా మైనారిటీ తీరకపోవడంతో ఆటో డ్రైవర్ పై పోక్సో చట్టం కింద కేసును పెట్టారు, ఈ ఘటన ఇప్పుడు ఇక్కడ వైరల్ అవుతోంది.