జటాయువు వెంటనే ఈ పేరు చెబితే మనవారు చెప్పేది గ్రద్ద అంటారు…జటాయువు రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర గ్రద్ద… మరి అసలు జటాయువు ఎవరు అతని గురించి కొన్ని విషయాలు చూద్దాం…జటాయువు శ్యేని, అనూరుల కుమారుడు. సంపాతి జటాయువుకి సోదరుడు. దశరథుడు ఇతడి స్నేహితుడు. రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో వీరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుంటాడు, చివరకు ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. ఇలా రాముడికి ఎంతో సాయం చేసినవాడిగా రామాయణంలో నిలిచిపోయాడు.
జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.
మీకు తెలుసా పురాణం ప్రకారం జటాయువు తన రెక్కలు తెగిన తర్వాత కేరళ లోని కొల్లాం జిల్లాకు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాడాయమంగళం లో రాళ్ళపైన పడింది.
ఇక్కడ చరిత్ర ఇదే చెబుతోంది. అందుకే ఇక్కడ ఈ ప్రాంతాన్ని జటాయుమంగళం అని పిలిచేవారు. ఇక్కడ సర్కారు ఓ పార్క్ ఏర్పాటు చేసింది.మన ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని ఏటపాక గ్రామంలో జటాయువు మందిరం ఉంది.ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనంతపురం జిల్లాలోని లేపాక్షి లో జటాయువు అంత్యక్రియలు రాముడు పూర్తి చేశాడని స్థలపురాణం చెబుతోంది, ఇది జటాయువు చరిత్ర.